కొడాలి నానికి సర్కార్ షాక్..! చనువుగా ఉన్న ఎస్సైపై వేటు..!

ఏపీలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి కూటమి సర్కార్ (AP Govt) ఇవాళ ఓ షాకిచ్చింది. తాజాగా గుడివాడలో నిర్వహించిన డీఎస్సీ నిరసనల సందర్బంగా జరిగిన ఓ పరిణామమే ఇందుకు కారణం. ఈ నిరసనలకు కొడాలి నానిని అనుమతించకుండా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అయినా స్దానిక ఎస్సై మాత్రం వీటిని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయనపై వేటు వేస్తూ ఇవాళ ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో పరిస్ధితి చేయి దాటిపోతోందా ? కీలక నిర్ణయాల దిశగా చంద్రబాబు..!
ఏపీలో పరిస్ధితి చేయి దాటిపోతోందా ? కీలక నిర్ణయాల దిశగా చంద్రబాబు..!

మెగా డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా గుడివాడలోనూ ఆందోళనలు చేపట్టేందుకు కొడాలి నాని పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను నిరసనల్లో పాల్గొనకుండా హౌస్ అరెస్టు చేసేలా ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గుడివాడ వన్ టౌన్ ఎస్సై సత్యనారాయణ కొడాలి నాని ఇంటికి వెళ్లి ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. దీంతో కొడాలి నాని డీఎస్సీ నిరసనలకు వెళ్లరని అంతా భావించారు.

AP Govt Transfers SI for Allegedly Mingling With Kodali Nani During Gudivada DSC Protest
లోకేష్ కవర్ ఫొటో వ్యాసానికి కోటి రిలీజ్?- తేల్చేసిన ఏపీ సర్కార్..!
లోకేష్ కవర్ ఫొటో వ్యాసానికి కోటి రిలీజ్?- తేల్చేసిన ఏపీ సర్కార్..!

కానీ సీన్ రివర్స్ అయింది. కొడాలి నాని ర్యాలీ నిర్వహించి మరీ డీఎస్సీ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం స్థానిక ఎస్సై సత్యనారాయణ సహకారమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఇవాళ ఆయన్ను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వైఎస్సార్సీపీ మాత్రం ఈ పరిణామంపై భిన్నంగా స్పందించింది. మాజీ మంత్రి కొడాలి నానితో దురుసుగా ప్రవర్తించిన గుడివాడ ఎస్‌ఐ‌‌ సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపింది. డీఎస్సీ అక్రమాలపై గుడివాడలో వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీకి అనుమతి ఇవ్వని వన్‌ టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణ. అంతేకాకుండా అనుమతి లేదంటూ అతి చేస్తూ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు ఇచ్చారని, అయితే దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన కొడాలి నానిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించారని, దీనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయని ట్వీట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+