మేషరాశి, వృషభరాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సార్లు సానుకూల ఫలితాలు, మరికొన్నిసార్లు ప్రతికూల ఫలితాలను ఇస్తుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లోనే అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. దీనివల్ల కొన్ని రాశులవారి జాతకం పూర్తిగా మారిపోయి అదృష్టం కలిసివస్తుంది. అలాగే సెప్టెంబరు నెలకు సంబంధించి మేషరాశి, వృషభరాశివారి జాతక ఫలం ఎలా ఉందనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి, మకర రాశి ఆగస్టు నెల జాతక ఫలం
ధనుస్సు రాశి, మకర రాశి ఆగస్టు నెల జాతక ఫలం

మేష రాశి (అశ్విని, భరణి, కార్తిక 1వ పాదం)

మేషరాశి వారికి ఈ సెప్టెంబరు నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి, అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం వహించాలి. కోపానికి తావివ్వకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ, ఊహించని ఖర్చులు రావచ్చు. పాత అప్పులు, చెల్లింపులకు కొంత సదుపాయం కలుగుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో కొన్ని చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. మాట్లాడే మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. తలనొప్పి, అలసట లేదా నీరసం వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం, తగినంత నిద్ర అవసరం. సుబ్రహ్మణ్యస్వామి లేదా ఆంజనేయస్వామి ఆరాధన చేయడం, రోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులారాశి, వృశ్చిక రాశి ఆగస్టు నెల జాతక ఫలం
తులారాశి, వృశ్చిక రాశి ఆగస్టు నెల జాతక ఫలం
Horoscope Predictions and results for these two signs Aries and Taurus for the month of September

వృషభ రాశి (కార్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)

వృషభరాశి వారికి ఈ సెప్టెంబరు నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు చేసే వారికి సానుకూల వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. లాభాలు అందుతాయి. అయితే, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఇంట్లో శుభకార్యాలు లేదా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల గొంతు లేదా ఛాతీ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయడం లేదా వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీ శ్రేయస్సు మరింత పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+