హేట్ స్పీచ్: అక్బరుద్దీన్ ఓవైసీ రిమాండ్ పొడగింపు

ద్వేషపూరిత వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ మీద నిజామాబాద్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో కూడా మరో కేసు నమోదైంది. అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో అక్బరుద్దీన్‌కు సంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మజ్లీస్ చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి కూడా బెయిల్ లభించింది.
ద్వేషపూరిత వ్యాఖ్యల కేసుల్లో బెయిల్ రాకపోవడంతో అక్బరుద్దీన్ విడుదల కావడం లేదు. డిసింబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయనను జనవరి 8వ తేదీన అరెస్టు చేశారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట శానససభ్యుడైన అక్బరుద్దీన్ ఓవైసీపై ద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను హైరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
బెంగళులో కోర్టు కూడా అక్బరుద్దీన్‌కు సమన్లు జారీ చేసింది. అక్బరుద్దీన్ ఓ వర్గం వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఒకరు బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పైన స్పందించిన కోర్టు అక్బరుకు సమన్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications