ఫొటోలు: చాన్సలర్ లేకుండా ఓయు స్నాతకోత్సవం
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్సలర్ నరసింహన్ లేకుండానే ఉస్మానియా విశ్వవిద్యాలయం 79వ స్నాతకోత్సవం ఠాగోర్ ఆడిటోరియంలో గురువారం ముగిసింది. తెలంగాణ సెగతో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) 79వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరైతే తాము అడ్డుకుంటామని, పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఓయూకు చెందిన పలు తెలంగాణ విద్యార్థి సంఘాలు హెచ్చరించారు.
విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత దృష్ట్యా తన పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. నిఘా విభాగం సూచన మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. గవర్నర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో స్నాతకోత్సవానికి చివరి నిమిషంలో గోవర్దన్ మెహతాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
దీంతో ఓయూ క్యాంపస్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని విద్యార్థి సంఘాలు గవర్నర్ పర్యటనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) గురువారం ఓయు బంద్‌కు పిలుపునిచ్చింది.

ఓ వైపు స్నాతకోత్సవం జరుగుతుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం ఇలా బోసిపోయి ఉంది.

విద్యార్థుల ఆందోళన సమయంలో మూసి ఉండే ప్రధాన ద్వారం వద్ద ఇలా సందడి.

స్నాతకోత్సవం కోసం ఠాగోర్ ఆడిటోరియంలోకి ఇలా అడుగులు వేస్తూ..

స్నాతకోత్సవ సభ ఇలా..

స్నాతకోత్సవం జరుగుతున్న హాల్‌లో ఇలా..

స్నాతకోత్సవ వేదికపై ఇలా...

ఓయు స్నాతకోత్సవ వేదికపై ఇలా పట్టాలు స్వీకరిస్తూ...












Click it and Unblock the Notifications