గాలి తరలింపుపై చేతులెత్తేసిన కర్ణాటక పోలీసులు

తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముండ్లూరు దివాకర్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ బళ్లారి కోర్టులో సాగుతోంది. గాలి జనార్దన్ రెడ్డిని తమ ముందు హాజరుపర్చాలంటూ జడ్జి గత నెల 18న వారెంట్ జారీ చేశారు. ఆ మేరకు గాలిని గురువారం బళ్లారికి తరలించాల్సి ఉంది. అయితే ఆయనకు తీసుకొస్తే తాము భద్రత కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో గాలిపై వారెంట్‌ను జడ్జి వెనక్కి తీసుకొన్నారు.
ఇదిలావుంటే, ఓబుళాపురం గనుల లీజు పొందిన గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సన్నిహితుడు బివి శ్రీనివాసరెడ్డి ఎక్కడెక్కడో ముడి ఇనుమును తవ్వి ఎగుమతి చేశారని, అలా వచ్చిన డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిబిఐ మరోమారు కోర్టుకు చెప్పింది. బెయిల్ కోరుతూ ఓఎంసీ కేసులో నిందితుడైన ఆ సంస్థ డైరెక్టరు బివి శ్రీనివాసరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సిబిఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు.
అక్రమంగా ఆర్జించిన డబ్బు ఎక్కడికి చేరిందో వెలికితీయాల్సి ఉందని చెబుతూ ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇవ్వవద్దని విన్నవించారు. ఓఎంసీ ద్వారా జరిగిన అక్రమాల్లో బీవీ పాత్ర ఉన్నట్లు ఆధారాలున్నాయంటూ ఓ సీల్డు కవర్‌ను సిబిఐ కోర్టుకు సమర్పించారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాది సురేంద్రరావు తీవ్ర అభ్యంతరం చెప్పారు. బీవీకి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న కోర్టు తీర్పును 12వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications