వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విఐపిలను వదిలేయండి, స్త్రీల కోసం వాడండి: సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారంనాడు ఢిల్లీ పోలీసులకు అనూహ్యమైన ఆదేశాలను జారీ చేసింది. విఐపిల భద్రత నుంచి పోలీసులను తప్పించి, ఢిల్లీలోని రోడ్లపై మహిళలకు రక్షణ కల్పించేందుకు వినియోగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించింది.

వేలాది మంది సిబ్బందిని న్యాయమూర్తుల భద్రతకు వినియోగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు గురువారంనాడు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల వాదనను విన్న సుప్రీంకోర్టు - ఈ సిబ్బందిని ఢిల్లీ రోడ్లపై మహిళలకు రక్షణ కల్పించడం వంటి మంచి పనులకు వాడాలని సూచించింది.

వివిఐపిల భద్రతకు పోలీసు ఆఫీసర్లను నియోగించే విషయంైప ఈ నెల 11వ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. సోమవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో రాష్టాల హోం శాఖ కార్యదర్శలు నేరుగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

తమిళనాడుకు నీరు విడుదల చేయాలి

తమిళనాడులోని సాంబా వరి పంట కోసం 2.44 టిఎంసిల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు లక్షల హెక్టార్ల పంటను కాపాడుకోవడానికి 9 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని తమిళనాడు సుప్రీంకోర్టును కోరింది. మెట్టూరు రిజర్వాయర్ నుంచి కర్ణాటక తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది.

English summary
The Supreme Court on Thursday asked the Delhi Police to withdraw cops from VIP security and deploy them for safety of women in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X