అమెరికా క్రెడిట్ కార్డు స్కామ్‌లో అమెరికన్ ఇండియన్స్

అమెరికా న్యాయ విభాగం అభియోగాలు మోపిన అతిన పెద్ద క్రెడిట్ కార్డు కుంభకోణాల్లో ఇదొకటి కావడం గమనార్హం. నిందితులు నకిలీ గుర్తింపులతో క్రెడిట్ కార్డులను పొంది నివేదికలను తేడాగా చూపించడంతో పాటు భారీగా పెంచి అప్పులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మోసపూరితంగా తయారు చేసిన రుణ చరిత్ర చూపి వ్యాపారాలు, ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు 1100 కోట్ల రూపాయలు స్వా చేసినట్లు అమెరికా అటార్నీ పాల్ ఫిష్‌మ్యాన్ తెలిపారు.
ఎఫ్‌బిఐ అధికారులు 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అభియోగాలు ఎదుర్కుంటున్నవారిలో బాబర్ ఖురేషి (59), ఇజాజ్ భట్ (53), రఘువీర్ సింగ్ (57), మహ్మద్ ఖాన్ (48), సత్ వర్మ (60), విజయ్ వర్మ (45), తర్సీమ్ లాల్ (74), వినోద్ దడ్లానీ (49) ఉన్నారు. నేరం రుజువైతే వారికి ఒక్కొక్కరికి ఎక్కువలో ఎక్కువగా 30 ఏళ్ల శిక్షతో పాటు 5 కోట్ల రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది.
ఈ కుంభకోణంలో నిందితులు కోట్లాది రూపాయలను పాకిస్తాన్, భారత్, యుఎఇ, కెనడా, రోమేనియా, చైనా, జపాన్‌లకు తరిలించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications