చెప్పండి, నిరూపిస్తాం: షర్మిల, అనిల్ దంపతులపై బిజెపి

Anil Kumar-Sharmila
హైదరాబాద్: షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్‌ దంపతులపై బిజెపి మరోసారి విరుచుకుపడింది. ఉదయం లేచింది మొదలు విశ్వసనీయత గురించి మాట్లాడే వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అసలు విశ్వసనీయతే లేదని విమర్శించింది.. పార్టీ నేతలు దాసరి మల్లేశం, రాములుతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

"షర్మిల ఆరు కంపెనీల్లో, అనిల్ 11 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారని ఇదివరకు నేను ఆధారాలతో బయటపెట్టాను. అయినా ఇప్పటివరకు వారిద్దరూ స్పందించలేదు. వైయస్ బతికున్నప్పడు విశ్వసనీయత ఉండాలని చెప్పేవారు. విజయలక్ష్మి బైబిల్‌ను చేతిలో పట్టుకుని విశ్వసనీయత గురించి మాట్లాడతారు. విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించి ఎందుకు విశ్వసనీయతను చాటుకోవట్లేదు? అంటే నేను చేసిన ఆరోపణలు వాస్తవాలేనని అంగీకరిస్తున్నారా?" అని ఆయన అన్నారు.

"మీరు చెప్పే విశ్వసనీయత అంతా బూటకమేనా? అసలు వైయస్ కుటుంబానికే విశ్వసనీయత లేదు. దమ్ము, ధైర్యం ఉంటే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్లు ప్రకటించండి. లేదంటే కంపెనీలు మీవి కావని చెప్పండి. అలా చెబితే ఆధారాలతో సహా నిరూపించడానికి మా సిద్ధంగా ఉంది'' ఆయన అన్నారు. విశ్వసనీయత లేని షర్మిల ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర పేరిట ప్రజల వద్దకు వెళుతోందని ప్రశ్నించారు.

"అనిల్‌ను కేవలం మత బోధకుడని మాత్రమే ప్రజలు నమ్ముతున్నారు. నిజానికి ఆయన పెద్ద రాజకీయ నాయకుడు. పెద్ద వ్యాపారి'' అని ప్రభాకర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం షర్మిల, అనిల్‌ కుమార్ పెట్టుబడులపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తమ పార్టీ గవర్నర్, సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రభాకర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+