జగన్ జైలుకెందుకెళ్లాడు?: గండ్ర, అనిల్ ఆస్తులపై టిడిపి

Ganda Venkataramana Reddy-Varala Ramaiah
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్లాడో ఆయన సోదరి షర్మిల రెడ్డి ప్రజలకు వివరించగలరా? అని ప్రభుత్వం చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ఆగాయంటూ షర్మిల తన పాదయాత్రలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

2004 నుండి ప్రవేశ పెట్టిన ఏ పథకం ఆగిపోయిందో ఆమె చెప్పగలరా అని సవాల్ విసిరారు. షర్మిల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ పార్టీ అధిష్టానంపై తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకు వస్తామని గండ్ర చెప్పారు. తక్షణమే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని తాము పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాస్తామన్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్నా రైతులు కాంగ్రెసు పార్టీకే ఓటు వేశారన్నారు. ఇతర తెలంగాణవాద ప్రజాప్రతినిధులతో కలిసి తాము తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

క్రైస్తవమతాన్ని అడ్డు పెట్టుకొని..

జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విజయవాడలో ఆరోపించారు. చందా డబ్బులతో జీవనం గడుపుతున్నానని చెప్పే బ్రదర్ అనిల్ కుమార్ 12 కంపెనీలలో డైరెక్టర్ ఎలా అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు.

షర్మిల పలు కంపెనీలలో వేల కోట్ల రూపాయలు ఏవిధంగా పెట్టుబడులు పెట్టారన్నారు. పెట్టుబడులపై షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లు సమాధానం చెప్పాలన్నారు. వారి పెట్టుబడులపై మీడియా సమక్షంలో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+