రాంకీ కార్యాలయాల్లో ఐటి సోదాలు: రోజంతా హడావిడి

Income Tax Logo
హైదరాబాద్: నిర్మాణం, మౌలిక వసతుల రంగంలోని రాంకీ గ్రూప్‌పై ఆదాయం పన్ను (ఐెటి) శాఖ అధికారులు గురువారంనాడు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని కార్పొరేట్ కార్యాలయం, తిరుపతి, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా ఈ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఉదయం నుంచే ప్రారంభమైన సోదాలు పొద్దుపోయే వరకు కొనసాగినట్టు తెలిసింది. కంపెనీ జరిపిన అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీ మధ్య తేడాలున్నట్టు ఐటి అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కంపెనీ చెల్లించిన అడ్వాన్స్ టాక్స్ వివరాలను కూడా అధికారులు పరిశీలించినట్టు తెలిసింది.

విశాఖ జిల్లా పరవాడలోని రాంకీ ఫార్మా సిటీ కార్యాలయం, రాంకీ కమర్షియల్ హబ్, స్మైలెక్స్ లేబొరెటరీస్‌లో ఉదయం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులను బయటకు పంపించి డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి సమక్షంలో ఐటి అధికారుల బృందం రికార్డులు, ఖాతా పద్దులను పరిశీలించినట్టు తెలిసింది. సోదాల సందర్భంగా సోమాజిగూడ కార్యాలయంలో సిబ్బందిని కూడా బయటకు పంపించారు. ఇదే సందర్భంలో మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి రాంకీ కార్యాలయానికి వచ్చారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కంపెనీలకు సంబంధించిన వివాదాస్పద లావాదేవీల కారణంగా రాంకీ గ్రూప్ ఇప్పటికే సిబిఐ, ఈడి అధికారుల దర్యాప్తును ఎదుర్కొంటోంది. వైయస్ జగన్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాంకీ గ్రూప్‌నకు చెందిన 143.74 కోట్ల రూపాయల స్థిర, చరాస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

వీటిలో రాంకీ ఫార్మా సిటీకి సంబంధించిన 135.46 కోట్ల రూపాయల స్థలంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లోని 3.20 కోట్ల రూపాయల డిపాజిట్లు, జగతి పబ్లికేషన్స్‌లోని 10 కోట్ల రూపాయల ఇన్వె స్ట్‌మెంట్‌ను ఇడి జప్తు చేసింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొందిన మేళ్లకు ప్రతిఫలంగా జగన్ వ్యాపారాల్లో రాంకీ గ్రూప్ పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+