జగన్ పార్టీలోకి శ్రీహరి!: జైల్లో కలువనున్న రియల్‌స్టార్

YS Jagan-Srihari
హైదరాబాద్: హీరో రియల్ స్టార్ శ్రీహరి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదైనా శాసనసభకు పోటీ చేస్తానని శ్రీహరి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జగన్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు శ్రీహరి జైల్లో ఉన్న జగన్‌ను కలువనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన జగన్ పార్టీలో చేరికపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా హైదరాబాదులో ఓ స్థానం నుండి ప్రముఖ హీరోను రంగంలోకి దింపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు గతంలో వచ్చాయి. దీంతో ఆ హీరో ఎవరనే ప్రశ్న పలువురిని తొలిచింది. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చినట్లుగా భావించవచ్చు. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి, వివి వినాయక్‌లతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇచ్చి సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేయించేందుకు వైయస్సార్ కాంగ్రెసు సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

హైదరాబాదులో కూడా ఓ ప్రముఖ హీరోను ఏదో ఒక స్థానం నుండి బరిలోకి దింపి నగరాన్ని మొత్తం ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. హీరో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆ హీరో ఎవరనే ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు అందరినీ తొలిచింది. పలువురు ఆ హీరో మాస్ హీరో రియల్ స్టార్ శ్రీహరి కావొచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకు వారు కారణాలు కూడా చెప్పారు. కొద్ది నెలల క్రితం హీరో శ్రీహరి అనూహ్యంగా బయటకు వచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానన్నారు.

ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు చాలామంది స్వాగతించారు. శ్రీహరి వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీహరి కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు ఓ ప్రముఖ హీరోను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జరిగింది. జగన్ పార్టీ తరఫున పోటీ చేసేది శ్రీహరే అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ నేడు రియల్ స్టార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను కలుస్తుండటంతో ఆ వాదనకు బలం చేకూరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+