జగన్ పార్టీలో చేరుతున్నా, రాజకీయ షేర్‌ఖాన్‌గా: శ్రీహరి

భేటీ అనంతరం మాట్లాడుతూ.. తాను జగన్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు శ్రీహరి చెప్పారు. తాను రాజకీయాల్లో కూడా షేర్ ఖాన్‌గా నిరూపించుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా జగన్‌ను కలిశారు.
జగన్‌ను కలిసిన వీరిద్దరూ పార్టీలో చేరే ముహూర్తం పైన చర్చించినట్లుగా ప్రచారం సాగుతోంది. ద్వారంపూడి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన తొలి నుండి జగన్‌కు మద్దతిస్తున్నారు. మధ్యలో కొన్నాళ్లూ జగన్‌కు హ్యాండ్ ఇచ్చినప్పటికీ తిరిగి మళ్లీ ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల పలుమార్లు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను, గౌరవాధ్యక్షురాలిని కలిశారు.
మరోవైపు శ్రీహరి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కొద్ది నెలల క్రితం హీరో శ్రీహరి అనూహ్యంగా బయటకు వచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు చాలామంది స్వాగతించారు.
శ్రీహరి వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీహరి కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు ఓ ప్రముఖ హీరోను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో హైదరాబాదులో ఏదో ఒక స్థానం నుండి శ్రీహరి పోటీ చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications