గర్ల్‌ఫ్రెండ్‌తో కాపురం చేసి, పెళ్లి వద్దన్న టెక్కీ అరెస్టు

సుధాకర్, అమ్మాయి మధ్య సోషల్ నెట్‌వర్క్ సైట్ ద్వారా స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా వికసించింది. సోషల్ నెట్‌వర్క్ సైట్ ద్వారా మిత్రులైన ఆ ఇద్దరు ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారని, ఆ తర్వాత ఏడేళ్ల పాటు సంబంధాలు పెట్టుకున్నారని పోలీసులు అంటున్నారు.
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన సుధాకర్ ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లికి నిరాకరించినట్లు వారు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సుధాకర్ మూడు నెలల క్రితం పూణేలోని ఓ ప్రముఖ ఐటి కంపెనీలో చేరాడు. అంతకు ముందు అతను హైదరాబాదులో పనిచేసేవాడు.
సుధాకర్‌ను పూణేలో అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.












Click it and Unblock the Notifications