ఎన్టీఆర్ విగ్రహాన్ని కాల్చి ధ్వంసం చేసిన దుండగులు

తెలుగుదేశానికి, ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి తెలియజెప్పిన మహనీయుడు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు తక్షణమే దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు.
తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని కానీ, ఇలా దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని టిడిపి కార్యాకర్తలు ధ్వజమెత్తారు. కాగా గుంటూరు జిల్లా వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విగ్రహ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు.
నల్గొండలో దోపిడీ దొంగల బీభత్సం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక హనుమానుపేటలో దుండగులు వృద్ధ దంపతులపై దాడి చేసి చోరికి పాల్పడ్డారు. నలభై తులాల బంగారు ఆభరణాలు, అరకిలో వెండి, రూ.యాభై వేల నగదు దోచుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications