జరగకపోవడం కన్నా లేట్ మేలు: అఫ్జల్ ఉరిపై మోడీ

అఫ్జల్ గురుకు ఉరిశిక్షను అమలు చేయడంలో జాప్యం జరిగిందని బిజెపి నేత స్మృతి ఇరానీ అన్నారు. ఆలస్యంగానే అయినా ఉరిశిక్ష అమలు జరగడాన్ని ఆహ్వానిస్తున్నామని బిజెపి మరో నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు. అఫ్జల్ గురు ఉరిశిక్ష కోసం దేశ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.
అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయడం వల్ల ఉగ్రవాదులకు గట్టి సందేశం వెళ్తుందని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రజల ఒత్తిడి వల్లనే అఫ్జల్ గురుకు యుపిఎ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసిందని ఆయన అన్నారు.
ఆలస్యంగానైనా అఫ్జల్ గురుకు ఉరిశిక్షను అమలు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అఫ్జల్ గురును ఉరితీయడం హర్షణీయమని కేంద్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి సిహెచ్ విద్యాసాగర రావు అన్నారు.












Click it and Unblock the Notifications