వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి చేసుకుంటే బాగు: అమేథీ వ్యక్తి: త్వరలో: రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
లక్నో: ఏఐసిసి ఉపాధ్యక్షుడు, అమేథీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీకి పెళ్లి గడియలు దగ్గర పడ్డట్లుగా కనిపిస్తున్నాయి. స్వయంగా ఆయనే త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలు ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆయన త్వరలో చేసుకుంటానని మాటిచ్చారు! రాహుల్ గాంధీ ఇటీవల జైపూర్ సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

ఇక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి కావడమే మిగిలి ఉంది. అది 2014లో తీరుతుందని కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే, రాజకీయాలను పక్కన పెడితే జీవితంలో ఆయనకు కావాల్సిన పెళ్లి తంతు ఇంకా జరగలేదు. దీంతో రాహుల్ పెళ్లి అప్పుడప్పుడు చర్చకు వస్తుంటుంది. రాహుల్ శుక్రవారం తన నియోజకవర్గమైన అమేథీలో పర్యటించారు. శనివారం చౌక్ మార్కెట్ మీదుగా ఊరేగింపులో వెళ్తున్న రాహుల్.. అదే సమయంలో గార్మెంట్స్ షాప్ తెరుస్తున్న దేవీ ప్రసాద్‌ను చూసి కుశల ప్రశ్నలు వేశారు.

వ్యాపారం ఎలా ఉందంటూ ఆరా తీశారు. దేవీ ప్రసాద్‌కు మహాత్మా గాంధీ వారసులతో మాట్లాడే చనువు ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని అంతా బాగానే ఉందని చెబుతూ... మా కోరిక అంతా ఒక్కటే అన్నారు. ఇప్పటికైనా మీరు పెళ్లి చేసుకోవాలని, మీ పెళ్లి ఊరేగింపు అమేథీలో సాగాలని, మా కోడలు కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని, ఇది నియోజకవర్గ ప్రజల కోరిక అని దేవీ ప్రసాద్ రాహుల్‌తో అన్నారు.

దీనికి స్పందించిన యువరాజు త్వరలో చేసుకుంటానని సమాధానమిచ్చాడు. కాగా వారసత్వంగా వచ్చిన రాజకీయాలను అందిపుచ్చుకుంటున్న రాహుల్ గాంధీ పెళ్లి విషయం మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశమవుతోంది. అయితే ఇఫ్పుడు ఆయనే త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అది త్వరలో నెరవేరుతుందని కాంగ్రెసు కార్యకర్తలు ఆనందపడుతున్నారు.

English summary
Marriage could be the last thing on Congress vice-
 
 president Rahul Gandhi's mind at this moment as he 
 
 strategises for the crucial general elections next 
 
 year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X