8 మందితో పెళ్లి: సాఫ్టువేర్ ఇంజనీర్ రేప్, చిత్రీకరించి...

ప్రసాద్ వయస్సు 26. అతను ఇప్పటికి ఎనిమిదిసార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దేవకీ భాయి ఆరో భార్య. గత పెళ్లిళ్ల గురించి తెలియకుండా తాను అతనిని పెళ్లి చేసుకున్నానని, తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని కాబోయే భార్యకు తెలియకుండా అతను జాగ్రత్తపడి పెళ్లి చేసుకుంటాడని, తాను అలాగే మోసపోయానని, ఊరుకుంటే మరింతమంది మహిళలు మోసానికి గురవుతారనే ఆందోళనతో ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పింది.
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారం
సాఫ్టువేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతికి ఆ సంస్థ యజమాని కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దిండుక్కల్ అలగానగర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఓ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆ యువతికి ఆ సాఫ్టువేర్ సంస్థ యజమాని కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.
స్పృహలోకి వచ్చిన ఆమెకు జరిగిన విషయాన్ని చెప్పాడు. తాను సదరు దృశ్యాలను చిత్రీకరించానని.. ఎవరికైనా చెబితే ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. పలుమార్లు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. భరించలేక ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications