28న పోప్ బెనడిక్ట్ రాజీనామా: ఆరోగ్య కారణాల వల్లనే!

ఈ నెల 28వ తేదిన మాత్రం బెనడిక్ట్ XVI తన పోప్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వాటికన్ ప్రతినిధులు ప్రకటించారు. పోప్ బెనడిక్ట్ XVI వయస్సు ప్రస్తుతం 85 ఏళ్లు. పోప్ జాన్ పాల్II మృతి అనంతరం 2005 ఏప్రిల్‌లో పోప్ బెనడిక్ట్ XVI ఎన్నుకోబడ్డారు.
ఏనిమిదేళ్లుగా పోప్‌గా కొనసాగుతున్నారు. అయితే, హఠాత్తుగా ఇప్పుడు పోప్ రాజీనామా చేయడం వెనుక గల కారణాలను మాత్రం కాథలిక్ చర్చ్ తెలియజేయలేదు. ప్రస్తుత కాలంలో పోప్ రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఆరోగ్య కారణాల వల్లనే పోప్ బెనడిక్ట్ XVI రాజీనామా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 28వ తేదిన పోప్ బెనడిక్ట్ XVI రాజీనామా చేయనున్నారని సోమవారం వాటికన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. తాను ఫిబ్రవరి 28వ తేదిన సాయంత్రం ఎనిమిది గంటలకు రాజీనామా చేస్తానని పోప్ చెప్పినట్లుగా అధికార ప్రతినిధి ఫెడరికో లాంబర్డ్ చెప్పారు.












Click it and Unblock the Notifications