కాళ్లు పట్టే సంప్రదాయం లేదు: షర్మిలకు గాలి కౌంటర్

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సాగిస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అది చూసి ఓర్వలేకనే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబులా పాదయాత్ర కొనసాగించలేక షర్మిల తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని ప్రజలను నమ్మించి పాదయాత్రను మధ్యలోనే ఆపేశారని ఎద్దేవా చేశారు.
కుడికాలికి శస్త్ర చికిత్సకు సంబంధించిన రిపోర్టును బయటపెట్టేందుకు సిద్ధమేనా అని ఆయన షర్మిలను ప్రశ్నించారు. అయినా, కాళ్లు పట్టుకొనే సంప్రదాయం రాచరికంలోనే ఉండేదన్నది గ్రహించాలని సూచించారు. మోకాలి ఆపరేషన్‌పై ప్రజలకు అనుమానం వచ్చిందని, దీన్ని నివృత్తి చేయాలేగాని సవాలు చేయరాదని హితవు పలికారు. బయ్యారం గనులను వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడి బోగస్ సంస్థకు దోచుపెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెసు పార్టీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. రుణ మాఫీ అసాధ్యమని సిఎం అనడం హాస్యాస్పదమన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామన్న సచిన్ పైలట్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెసు సహకార ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. రాజకీయంగా రైతులే కాంగ్రెసును హత్య చేస్తారన్నారు. తమ హయాంలో కేంద్రంతో పోరాటి రుణ మాఫీ చేయించిన ఘనత బాబుదే అన్నారు.












Click it and Unblock the Notifications