'చిరు తన వ్యాఖ్యలు గుర్తుంచుకోవాలి, మాకు గుర్తుంది'

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోరాడి తాము తెలంగాణ సాధించుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణపై న్యాయం చేయడంతో పాటు సకాలంలో న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని కోదండరామ్ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రాల డిమాండ్లు పెరుగుతాయనే వాదనలో పస లేదన్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే షిండే సంప్రదింపుల మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
చిరంజీవిపై మండిపాటు
2014 కల్లా తెలంగాణ అంశాన్ని మరిచిపోతారన్న కేంద్ర పర్యాట శాఖ మంత్రి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కోదండరామ్ తీవ్రంగా స్పందించారు. చిరంజీవి నాలుగేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటానని చెప్పారని, తాను చెప్పిన విషయాన్ని చిరంజీవి గుర్తుంచుకోవాలన్నారు. ఆయన ఏం చెప్పారో తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. సినిమాలో హీరో స్క్రిప్ట్ మరిచిపోతే ఎలా ఉంటుందో.. ఇప్పుడు చిరంజీవి విషయంలో అలాగే ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ మోసం చేస్తోంది: ఈటెల
తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీయే మొదటి నుండి మోసం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణలో కాంగ్రెసును భూస్థాపితం చేస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతిఘటనలు తప్పవన్నారు.












Click it and Unblock the Notifications