ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: స్నేహితుడి భార్యపై రేప్

మిత్రుడి భార్యపై అత్యాచారం
ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్య పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాదులోని రాజేంద్రనగర్ ప్రాంతంలో జరిగింది. నిందితుడిని రాజేంద్ర నగర్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి, కిషన్ బాగ్ నివాసి వెంకటేష్‌లు స్నేహితులు. ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో తన స్నేహితుడికి ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చేందుకు వెంకటేష్ అతని ఇంటికి వెళ్లాడు.
మిత్రుడి భార్య తన భర్త ఇంట్లో లేడని చెప్పింది. దీంతో ఒంటరిగా ఉన్న ఆమెపై అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి బాధితురాలు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తమ పరిధి కాదని చెప్పడంతో రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications