పెళ్లికి అంగీకరించలేదని యాసిడ్ దాడి: లేడీ టెక్కీ మృతి

యాసిడ్ దాడికి పాల్పడిన సురేష్‌ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెన్నై పోలీసులు చెప్పారు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో సురేష్ వినోదినిపై యాసిడ్ దాడికి ఒడిగట్టాడు. వినోదిని దీపావళి పండుగకు ఇంటికి వెళ్లి చెన్నైకి తిరిగి వస్తుండగా నిరుడు నవంబర్ 14వ తేదీన సురేష్ ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు.
యాసిడ్ పడడంతో ఆమె కన్ను ఒకటి కాలిపోయింది. తొలుత ఆమెను కరైకల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆమెను చేర్పించారు. ఆ తర్వాత చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రత్యేక చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వినోదిని తండ్రి జయపాల్ కరైకల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన బిడ్డ పడిన బాధనే నిందితుడు కూడా పడాలని, నిందితుడిపై యాసిడ్ పోయాలని అతను అంటున్నాడు.












Click it and Unblock the Notifications