అఫ్జల్ గురు చివరి లేఖ భార్యకే: ఏం రాశాడు?

అది అతని చివరి కోరిక అని, దాన్ని మరో మార్గం లేకపోవడంతో తాము స్పీడ్ పోస్టు ద్వారా పంపించామని, త్వరలోనే ఆమెకు ఆ లేఖ చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు కలం, కాగితాలను దగ్గర పెట్టుకుని రాయడంలో అఫ్జల్ గురు జైలులో నిమగ్నమై ఉండేవాడని జైలు అధికారులు చెబుతున్నారు.
భార్యకు రాసిన లేఖలో తన కుటుంబ విషయాలను మాత్రమే అఫ్జల్ గురు ప్రస్తావించాడని జైలు అధికారులు చెప్పారు. అది పూర్తిగా వ్యక్తిగతమైన లేఖ అని, తన మరణానికి చింతించవద్దని, తమ కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని భార్యకు సూచించాడని వారు వివరించారు. కుమారుడి కోసం గుండెను దిటవు చేసుకుని, నిస్పృహకు గురి కావద్దని ఆయన సూచించాడు. అఫ్జల్ గురు రాసిన లేఖలో దేశవిషయాలేవీ లేవని అధికారులు అన్నారు.
కాశ్మీర్‌లోని సోపోర్‌లో గల అఫ్జల్ గురు కుటుంబానికి ఆ లేఖ ఇంకా అందాల్సే ఉంది. ఉరికంభానికి ఎక్కే ముందు రోజు గురించి అఫ్జల్ గురుకు సంబంధించి అన్నీ ఊహాగానాలే ప్రచారంలోకి వచ్చాయని, ఉరి కంభం ఎక్కడానికి ముందు నిద్రలేని రాత్రి గడిపాడనేది నిజం కానది, జైలులో చాలా ఆదర్శంగా వ్యవహరించాడని, చివరి వరకు కూడా ఏ విధమైన సమస్యనూ సృష్టించలేదని జైలు అధికారులు అన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications