ప్రాణాలకు తెగించి యజమానిని రక్షించిన కూకీ చిలుక

బెన్ అంతకుముందు ఇంటిలో అగరొత్తులను వెలిగించి స్నానానికి వెళ్లాడు. అగరొత్తుల నుంచి వెలువడిన నిప్పు రవ్వలు పరుపు మీద పడ్డాయి. దీంతో క్షణాల్లో పడగ గది నిండా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో బెన్ పెంపుడు చిలుక కూకీ ప్రమాదాన్ని పసిగట్టింది. వెంటనే అది అరుస్తూ స్నానపు గది తలుపును పదే పదే ఢీకొట్టింది. దీంతో బెన్ బయటకు వచ్చాడు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాడు.
మంటలు వేగంగా ఇల్లంతా వ్యాపించడంతో ఊపిరాడక బయటికి అతను వచ్చేశాడు. కూకీ హెచ్చరికల వల్ల బెన్ ప్రాణాలు రక్షించుకున్నాడు. అయితే, యజమాని ప్రాణాలు కాపాడిన కూకీ మాత్రం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో చిలుక తన గురించి ఆలోచించలేదని డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది. బెన్ తల్లి విక్కీ రీస్ మాట్లాడుతూ.. కూకీ బెన్ గార్డియన్ ఏంజిల్ అని, ఆ చిలుక హీరో అని పేర్కొంది. హీరోగా మరణించిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications