కూతురితో పోటీ పడి: రవిశంకర్‌కు గ్రామీ, బాధలేదంటూ

ఆయన తన కుమార్తె అనౌష్కతో పోటీపడి ఈ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ వేడుకలో రవిశంకర్ కుమార్తె అనౌష్క తన తండ్రి తరపున ఈ అవార్డును స్వీకరించారు. తండ్రి చేతిలో ఓటమి చెందడం తనకు బాధకలిగించడం లేదని అనౌష్క తెలిపారు. అంతకు ముందు రవి శంకర్ మరో కుమార్తె నోరాతో కలిసి జీవితకాల సాఫల్య అవార్డును ఆమె అందుకున్నారు. 92 ఏళ్ల రవి శంకర్ గత డిసెంబర్ 11న మృతి చెందారు.
రవి శంకర్‌తోపాటు పలువురు సంగీతకారులు గ్రామీ అవార్డు దక్కించుకున్నారు. బీటిల్స్ ప్రముఖుడు పాల్ మెకార్టిని తన కిసెస్ ఆన్ ద బాటమ్ ఆల్బమ్‌కు బెస్ట్ ట్రెడిషనల్ పాప్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు లభించింది. అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన విభాగంలో బ్రిటన్ గాయని అడెలే గ్రామీని సొంతం చేసుకుంది.
గత ఏడాది గ్రామీ అవార్డుల్లో అడెలే ఆరు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ ఏటి అత్యుత్తమ ఆల్బమ్‌గా బాబెల్ రూపకర్తలు మమ్‌ఫోర్డ్ అండ్ సన్స్ గ్రామీ దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన మ్యూజిక్ బ్యాండ్ బ్లాక్ కీస్ మూడు గ్రామీలు సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications