ఇంటర్ అమ్మాయితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన, దేహశుద్ధి

అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం గమనించిన స్థానికులు అప్పటికే ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. అమ్మాయి, తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. మరోవైపు మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని హరనాథపురంలో జరిగిన జంట హత్యలపై ఆందోళన కొనసాగుతోంది. ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు భార్గవిని, శకుంతలను హత్య చేసిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఆందోళనకు దిగారు.
ఈ హత్యలను పథకం ప్రకారమే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫార్మసీ కళాశాల యజమాని దినకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు వారిపై కత్తులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భార్గవి, శకుంతల మృతి చెందగా, దినకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఐదుగురిలో ఇద్దరు పారిపోగా, మరో ముగ్గురు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలకు కారణం ప్రేమ వ్యవహారం అని, దొంగలు అని, బకాయి వసూలు కోసం వచ్చి ఇలా ఘాతుకానికి పాల్పడ్డారనే పలు రకాల వాదనలు వినిపించాయి. పోలీసులు నిందితులను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications