• search
For hyderabad Updates
Allow Notification  

    చంద్రబాబు యాత్ర: ఢిల్లీ పెద్దలకు నారా లోకేష్ చురక

    By Srinivas
    |
    Nara Lokesh
    హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సామాజిక వెబ్ సైటు ట్విట్టర్‌లో మరోసారి తనైదన శైలిలో స్పందించారు. నారా లోకేష్ ట్విట్టర్‌లో మరోసారి కాంగ్రెసు పార్టీ తీరు పైన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర మంగళవారం రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. కాంగ్రెసు తీరుపై సెటైర్ వేశారు.

    తన తండ్రి చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సమయంలో ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు నగదు బదలీ పథకాన్ని ప్రకటించారని అన్నారు. అది ప్రభావితంగా లేదని అభిప్రాయపడ్డారు. తన తండ్రి పాదయాత్ర మంగళవారం రెండు వేల కిలోమీటర్లు చేరుకునే సమయంలో రుణ మాఫీ చేయడానికి సిద్ధమని ప్రకటించారని ఎద్దేవా చేశారు. తన తండ్రి పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీలో కనిపిస్తున్నట్లుగా ఉందన్నారు.

    కాగా నారా లోకేష్ అంతకుముందు పలుమార్లు ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పైన విమర్శలు గుప్పించారు. హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌వి రమణపై సాక్షి పత్రికలో రాసిన వార్త ఆధారంగా వేసిన కేసులో సుప్రీం కోర్టు ఇద్దరు న్యాయవాదులకు అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. సాక్షి పత్రిక వార్తను సుప్రీం తప్పు పట్టింది. దీనిపై లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు.

    బెదిరించేందుకు, హింసించేందుకు, నీచమైన ప్రచారం చేసేందుకు సాక్షి పత్రిక ఒక పరికరంగా ఉపయోగపడుతోందని సుప్రీం కోర్టు తీర్పుతో తేలిందన్నారు. ఆ తర్వాత సాక్షి పత్రికను ఉద్దేశించి.. సాక్షీ! మీ తర్వాతి వార్త సుప్రీం కోర్టు పైనేనా? అంటూ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 5న మంగళవారం రోజున ఆయన ట్విట్టర్‌లో ఈ కామెంట్ చేశారు. నారా లోకేష్ తరుచూ ట్విట్టర్‌లో జగన్ పార్టీ, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

    గత డిసెంబర్‌లో హెరిటేజ్‌పై దాడిని నిరసిస్తూ... లోకేష్ ట్వీట్ చేశారు. మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయంటూ భారత దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుండగానే కొందరు హెరిటేజ్ స్టోర్స్ పైన దాడి చేసి మహిళలపై అటాక్ చేశారన్నారు. వారిని ఎవరిని పంపించారంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అంతకుముందు అఖిల పక్ష సమావేశంలో టిడిపి తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పడంపై స్పందిస్తూ.. హరీష్, నీ అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవన్ ఎదురు చూస్తోందని రాశాడు. అలాగే కెటిఆర్, రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని రాశాడు. హరీష్ రావు అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవనం ఎదురు చూస్తోందని, కెటిఆర్ రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని ఆతను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

    English summary
    1000km, they announced a poor copy of cash transfer scheme. 2000km, we hear loan waiver. Padayatra tremors being felt in Delhi?

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more