వాలెంటైన్స్ డే కిస్సథాన్: రికార్డ్ కోసం లిప్ లాక్ ముద్దు
థాయ్‌లాండ్: తొమ్మిది మంది థాయ్ జంటలు లిప్ లాక్‌లో కొత్త రికార్డ్ సృష్టించేందుకు కిస్సథాన్‌లో పాల్గొంటున్నారు. ఎక్కువ సమయం ముద్దు పెట్టుకొని రికార్డ్ సృష్టించాలనుకుంటున్నారు. థాయ్‌లాండులోని జరుగుతున్న థాయ్ కిస్సథాన్‌లో తొమ్మిది జంటలు పాల్గొన్నాయి. 50 గంటల 25 నిమిషాల ఒక సెకండుపాటు కిస్ పెట్టుకున్న రికార్డ్ ఒకటి గిన్నిస్‌లో చోటు చేసుకుంది.
దానిని దాటాలంటే ఈ జంటలు అంతకంటే ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది. ముద్దుల పోటీలో పాల్గొంటున్న వారు కేవలం నీటిని లేదా పాలను స్ట్రాస్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుందని ఈ ఈవెంట్ అధికార ప్రతినిధి చెప్పారు. గత రికార్డును ఇప్పుడు పాల్గొంటున్న తొమ్మిది జంటలలో ఒక జంట బ్రేక్ చేస్తుందని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని మరొక ప్రతినిధి ఈ సందర్భంగా చెప్పారు.

సాధారణంగా ప్రేమికుల రోజును ఎనిమిది రోజులు జరుపుకుంటారు. వాలంటైన్స్ డేకు వారం రోజుల ముందు ఫిబ్రవరి 7న గులాబీల రోజు (రోజ్ డే)తో ఇవి మొదలవుతాయి. ఆ తర్వాత వరుసగా ప్రేమ వ్యక్తీకరణకు.. 8న 'ప్రపోజ్ డే', చాకోలెట్లు ఇచ్చిపుచ్చుకునేందుకు.. 9న 'చాకోలెట్ డే', బహుమతుల కోసం.. 10న 'టెడ్డీ డే', తోడుంటానంటూ ప్రమాణం చేసేందుకు.. 11న 'ప్రామిస్ డే', వేడి వేడి ముద్దుల కోసం.. 12న 'కిస్ డే', కౌగిలింతల కోసం.. 13న 'హగ్ డే', చివరిగా అసలైన ప్రేమికుల రోజు.. 14న 'వాలంటైన్స్ డే'గా నిర్వహిస్తారు.
మంగళవారం 'కిస్ డే' సందర్భంగా.. థాయ్‌లాండ్‌లో తొమ్మిది జంటలు కొత్త రికార్డు సృష్టించే పని మొదలుపెట్టాయి. అత్యంత సుదీర్ఘంగా ముద్దులు పెట్టుకుని.. ప్రపంచ రికార్డును కొట్టేసేందుకు.. 'థాయ్ కిస్సథాన్'ను మొదలుపెట్టేశాయి. బుధవారం.. అదే ఫిబ్రవరి 13 'కౌగిలింతల రోజు'. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జంటలు 'ఫ్రీ హగ్' కార్యక్రమాలకు సిద్ధమైపోయాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications