అగస్టా హెలికాప్టర్ కొనుగోలు: తెరపైకి వైయస్ పేరు!?

YS Rajsekhar Reddy
హైదరాబాద్: అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇది అధికార కాంగ్రెసు పార్టీకి పెద్ద చిక్కులు తీసుకు వచ్చింది. ఈ హెలికాప్టర్ల కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం వంటిదని, దీనిని సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలనే డిమాండ్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ఈ అగస్టా హెలికాప్టర్ కుంభకోణం మూలాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పరోక్షంగా, ప్రత్యక్షంగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులతో సంబంధం ఉన్న వారేనని ఆయన అన్నారు. అగస్టా హెలికాప్టర్ కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోలులో ఎమ్మార్ డైరెక్టర్ కీలక పాత్ర పోషించినట్లుగా వార్తలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆ డైరెక్టర్ వైయస్‌కు సన్నిహితుడే అన్నారు.

అగస్టా హెలికాప్టర్ కుంభకోణం బయటకు రావడంతో ఇటీవల బేగంపేట విమానాశ్రయం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన రాష్ట్ర ప్రభుత్వ అగస్టా హెలికాప్టర్ విషయంలోను అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ అగస్టా హెలికాప్టర్ వైయస్ హయాంలో కొనుగోలు చేసిందే అన్నారు. దీంతో అగస్టా కాలిపోవడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఏటా నిర్వహణ కోసం రూ.15 కోట్లు వెచ్చించే హెలికాప్టర్ వైయస్ ప్రయాణానికి ఉపయోగపడలేదని ఆయన అన్నారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోలు విషయంలో వైయస్ పాత్రపై విచారణ జరిపించాలన్నారు.

అగస్టా డీల్‌కు ఆంధ్రాతో సంబంధాలు?

అగస్టా డీల్‌కు ఆంధ్రతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలు వస్తున్నాయి. ఎమ్మార్-ఎంజిఎఫ్ డైరెక్టర్‌గా పని చేసిన హష్కే అగస్టాతో సంబంధాలున్నాయని అంటున్నారు. అదే సమయంలో ఖమ్మంలోని అర్బోరా చారిటబుల్ ఫౌండేషన్‌కు చెందిన వ్యక్తులకు కూడా అగస్టాతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. వీరితో పరోక్షంగా, ప్రత్యక్షంగా వైయస్ లేదా బ్రదర్ అనిల్ కుమార్‌లకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+