Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్కులకు తాళాలు: లవర్స్‌కి మూడుచోట్ల 'దళ్' పెళ్లి

Bajrang Dal activists perform marriage of couple
హైదరాబాద్: ఫిబ్రవరి 14వ తేదిన వాలెంటైన్స్ డే అంటూ రోడ్ల మీద తిరిగితే ప్రేమికులకు పెళ్లి చేస్తామని హెచ్చరించిన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు గురువారం ఓ జంటకు పెళ్లి చేశాయి. హైదరాబాదులోని కుషాయిగూడలో రాజు, గౌతమి అనే ప్రేమికులకు బజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. స్థానిక సాయిబాబా గుడిలో వారు పెళ్లి చేశారు.

కోఠిలోని విహెచ్‌పి కార్యాలయంలో అరుణ్-జయశ్రీ అనే ప్రేమికులకు విహెచ్‌పి కార్యకర్తలు పెళ్లి చేశారు. సంఘీ టెంబుల్‌లో మరో పెళ్లి చేశారు. ప్రేమ జంటలు కనిపిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి చేసేందుకు బజరంగ్ దళ్, విహెచ్‌పి కార్యకర్తలు తాళిబోట్లతో తిరుగుతున్నారు.

ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామని, రిసార్టులు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపవద్దని విహెచ్‌పి, బజరంగ్ దళ్ నిన్న హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రేమికుల దినోత్సవం కళ విహీనమయింది. గతంలో కనిపించినంత ప్రేమికుల దినోత్సవం ఈసారి కనిపించలేదు. హెచ్చరికల నేపథ్యంలో ఇందిర పార్కు, లుంబిని పార్కు, సుందరయ్య పార్క్ తదితర పార్కులను మూసివేశారు.

సాయంత్రం వరకు పార్కులను మూసివేయనున్నారు. ప్రేమికులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు పార్కులను మూసివేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఇందిర పార్కు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ప్రేమికులను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విహెచ్‌పి, బజరంగ్ దళ్ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమకు వ్యతిరేకం కాదు

తాము ప్రేమకు వ్యతిరేకం కాదని బజరంగ్ దళ్, విహెచ్‌పి కార్యకర్తలు అన్నారు. తుచ్చమైన విదేశీ సంస్కృతి మోజులో ఉన్నతమైన మన సంస్కృతిని యువత మర్చిపోతున్నారంటున్నారు. తాము ఎవరికీ బలవంతంగా పెళ్లిళ్లు చేయడం లేదని, ప్రేమికులు కనిపిస్తే వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి చేస్తున్నామన్నారు. ప్రేమకు వ్యతిరేకమే అయితే, ఎప్పుడు వ్యతిరేకించే వారమని కానీ, తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, విదేశీ సంస్కృతి అయినా వాలెంటైన్స్ డేకు వ్యతిరేకమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+