బాబుకు జూనియర్, లోకేష్ ఫోన్: పాదయాత్రపై సూచన

మరోవైపు బాబుకు ప్రమాదం తప్పిందన్న విషయం తెలియగానే బాబు సతీమణి నారా భువవనేశ్వరి, తనయుడు నారా లోకేష్, బావమరిది నందమూరి బాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌లు బాబుకు, ఆయనతో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఫోన్‌లు చేసి ఆరోగ్యం, ప్రమాదంపై వాకబు చేశారు. భువనేశ్వరి నేరుగా బాబుతో ఫోన్‌లో మాట్లాడి తాము వస్తున్నామని, అప్పటి వరకు పాదయాత్రను ప్రారంభించవద్దని సూచించారు.
బాబు తూలిపడ్డారని తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాబు కాలికి స్వల్ప గాయం మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదని, టిడిపి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
కాగా చంద్రబాబు గురువారం తూలిపడ్డ విషయం తెలిసిందే. కొలకలూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన మెట్ల నుండి కిందకు దిగే ప్రయత్నాలు చేశారు. ఆయన దిగుతున్న సమయంలో వేదిక కోసం ఏర్పాటు చేసిన మెట్లు కూలిపోయాయి. బాబు తూలిపడబోయారు. అయితే, గన్‌మెన్‌లు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాబుకు చిన్న గాయం కాకుండా రక్షించారు. వేదిక కూలగానే బాబు తూలి కిందకు పడబోతుండగా వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్‌లు ఆయనను అమాంతం చేతులపై ఎత్తుకున్నారు. దీంతో బాబుకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. కాలికి మాత్రం స్వల్పంగా గాయమైంది. మాజీ మంత్రి అలపాటి రాజాకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications