కెసిఆర్ జై తెలంగాణ!: 'ఉద్యమం' ప్రారంభం(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవనంలో 'ఉద్యమం' అనే చిత్ర షూటింగను ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 'ఉద్యమం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి కెసిఆర్ నిన్న(బుధవారం) క్లాప్ కొట్టారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్ర ప్రారంభోత్సవంలో కెసిఆర్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులు తదితరులు పాల్గొన్నారు. పూజ అనంతరం సినిమాను ప్రారంభించారు. యువకులు జై తెలంగాణ అని నినదిస్తుండగా కెసిఆర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రం తెలంగాణ ఉద్యమ తీరు ఎలా ఉండాలో తెలిపే విధంగా ఉంటుందని కెసిఆర్ అన్నారు. చిత్రం తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ఉద్యమం క్రమంలో ఏం చేయాలనే విషయం ఈ చిత్రం చెబుతుందన్నారు. ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు ఈ చిత్రం మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు. గతంలో వచ్చిన జైబోలో తెలంగాణ, పోరు తెలంగాణల కంటే ఘన విజయం సాధిస్తుందన్నారు.

జై తెలంగాణ..! క్లాప్ కొడుతున్న కెసిఆర్

కెసిఆర్ పూజలు చేస్తుండగా క్లిక్.. క్లిక్

మైక్‌ను టెస్టు చేస్తూ..

మాట్లాడుతున్న కెసిఆర్












Click it and Unblock the Notifications