బాబుకు తప్పిన ప్రమాదం: చేతులతో అమాంతం ఎత్తి...

Chandrababu Naidu
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం తూలిపడ్డారు. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఇది కొలకలూరు చేరుకున్న తర్వాత బాబు అక్కడున్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన ఏర్పాటు చేసిన మెట్ల నుండి కిందకు దిగే ప్రయత్నాలు చేశారు. ఆయన దిగుతున్న సమయంలో వేదిక కోసం ఏర్పాటు చేసిన మెట్లు కూలిపోయాయి. బాబు తూలిపడబోయారు. అయితే, గన్‌మెన్‌లు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాబుకు చిన్న గాయం కాకుండా రక్షించారు. వేదిక కూలగానే బాబు తూలి కిందకు పడబోతుండగా వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్‌లు ఆయనను అమాంతం చేతులపై ఎత్తుకున్నారు. దీంతో బాబుకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. కాలికి మాత్రం స్వల్పంగా గాయమైంది. మాజీ మంత్రి అలపాటి రాజాకు గాయాలయ్యాయి.

కాగా చంద్రబాబుకు ఫిజియో థెరపీ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వేదిక కూలిన అనంతరం బాబును తీసుకు వచ్చి ఓ కుర్చీ పైన కూర్చోబెట్టారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాదయాత్రను ప్రస్తుతానికి విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాబుకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. బాబుకు పరీక్షల కోసం హైదరాబాదు నుండి ప్రత్యేక బయలుదేరే అవకాశముంది. వారు వచ్చే వరకు పాదయాత్ర నిలిపివేయాలని కార్యకర్తలు సూచించారు. బాబును సమయస్పూర్తితో కాపాడిన గన్‌మెన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రబాబు వేదిక దిగితుండగా భారీగా విద్యార్థులు, కార్యకర్తలు ఆయన ఆటో గ్రాఫ్ కోసం ఎగబట్టారు. ఈ సందర్భంగా వేదిక కూలింది. కాగా అంతకుముందు బాబు కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. హెలికాప్టర్ల కుంభకోణం మరో బోఫోర్స్ అని మండిపడ్డారు. రూ.380 కోట్లు లంచాల రూపంలో తిన్నారని ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+