అ ఆ ఇ ఈ..: వసంతపంచమిన అక్షరాభ్యాసం(పిక్చర్స్)

హైదరాబాద్/అదిలాబాద్/మెదక్: వసంత పంచమి సందర్భంగా అదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వసంత పంచమి రోజును సరస్వతి అమ్మవారి పుట్టిన రోజు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుండే కిలోమీటర్ల మేర క్యూలైన్ కనిపించింది.

వర్గల్‌లోనూ...

బాసర సరస్వతి ఆలయం తర్వాత ప్రసిద్ధి గాంచిన వర్గల్ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసం కోసం భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అక్షరాభ్యాసం కోసం భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.

ఓయులో...

ఓయులోని క్యాంపస్‌లోని సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం కోసం నగర వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వసంతపంచమి నేపథ్యంలో ఉత్తర భారతంలో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వచ్చారు. కాగా మరోవైపు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ దంపతులు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

(ఓయు క్యాంపస్‌లో అక్షరాభ్యాసం చిత్రాలు)

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

చిన్నారికి ఓం నమఃశివాయ అంటూ అక్షరాభ్యాసం చేయిస్తున్న పెద్దలు

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

చిన్నారికి ఓం నమఃశివాయ అంటూ అక్షరాభ్యాసం చేయిస్తున్న పెద్దలు

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

అక్షరాభ్యాసం చేస్తున్న చిన్నారులు

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

సరస్వతీ ఆలయంలో భక్తులు

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

అమ్మవారికి మొక్కుతున్న చిన్నారి

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

అమ్మవారు

 అ ఆ ఇ ఈ...: అక్షరాభ్యాసం(ఫోటోలు)

చిన్నారులకు పలకలు ఇస్తున్న మరో పాప

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+