కిందపడ్డ లిఫ్ట్: పొన్నం,పొన్నాల సేఫ్, బాబుయాత్ర స్టార్ట్

Ponnam Prabhakar - Ponnala Laxmaiah
కరీంనగర్/గుంటూరు: ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణలకు శుక్రవారం ప్రమాదం తప్పింది. వారు కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిని ప్రారంభించి వస్తుండగా వారు ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా ఫెయిలై కిందపడిపోయింది. ఆ సమయంలో ముగ్గురు లిఫ్టులోనే ఉన్నారు. అయితే, వారికి స్వల్ప గాయాలు మినహా ఏమీ కాలేదు. ముగ్గురూ క్షేమంగా బయటపడ్డారు.

బాబు యాత్ర ప్రారంభం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. బాబు కాలునొప్పితోనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా కొలకనూరు నుంచి ఆయన నేటి యాత్రను ప్రారంభించారు. గురువారం కొలకనూరులో ఏర్పాటు చేసిన వేదిక మెట్లు కూలిపోవడంతో బాబు తూలిపడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాబు కాలికి గాయమైంది.

కిందపడబోతున్న బాబును ఆయన భద్రతా సిబ్బంది రక్షించింది. వారు అప్రమత్తమవడంతో బాబుకు పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఆయన కాలు బెణికింది. దీంతో గురువారం పాదయాత్రకు విశ్రాంతి ఇచ్చారు. ఆయనను పరిశీలించిన వైద్యులు పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని సూచించారు.

ఈ రోజు ఉదయం వైద్యులు మరోసారి ఆయనను పరీక్షించారు. ఆయనకు పలు సూచనలు చేశారు. రోజుకు ఐదారు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడువవద్దని సూచించారు. వైద్యుల పరీక్ష అనంతరం బాబు యాత్ర ప్రారంభమైంది. కొద్ది దూరం నడిచిన తర్వాత బాబు కాలు పరిస్థితిని వైద్యులు మరల పరీక్షించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+