కాల్చివేత: ఆటపట్టించేందుకు మాస్క్‌తో వచ్చిన గర్ల్‌ఫ్రెండ్

బ్లేడ్ రన్నర్‌గా పేరొందిన అస్కార్ పిస్టోరియస్ ఎప్పుడూ తన చెంత ఆయుధాలు ఉంచుకునేవాడట. తన పడకగది తలుపు వద్ద ఓ క్రికెట్ బ్యాట్, ఓ బేస్ బాల్ బ్యాట్ నిత్యం ఉంటాయట. మంచం పక్కనే రివాల్వర్, అక్కడే ఉన్న కిటికీలో మెషిన్ గన్ సిద్దంగా ఉంటాయట. బ్లేడ్ రన్నర్‌గా పేరొందిన పిస్టోరియస్‌కు షూటింగ్ అంటే చాలా ఇష్టం. గురి తప్పకుండా కాల్చడంలో సిద్దహస్తుడు. నిద్ర పట్టనప్పుడల్లా తన పిస్టల్‌తో ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయట. షూటింగ్ కోచ్‌లకు కూడా తీసిపోని విధంగా నేర్పరి.
పిస్టోరియస్ గతంలో పలుమార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తన ప్రియురాలిని అనుకోకుండా కాల్చినప్పటికీ అంతకుముందు అతను జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఓ టీనేజ్ అమ్మాయి పైన దాడి చేశాడు. దీనికి 2009లో ఒకరోజు జైలు శిక్ష అనుభవించాడు. పిస్టోరియస్ అందరూ అనుకునేలాంటివాడేమీ కాదని అతని మాజీ ప్రియురాలు ఓ సందర్భంగా చెప్పింది. పిస్టోరియస్ తన ప్రియురాలిని షూట్ చేసినందుకు హత్యానేరం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
ఇక పిస్టోరియస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన రీవా స్టీన్‌కాంప్ దక్షిణాఫ్రికాలో పేరున్న మోడల్ మాత్రమే కాకుండా వ్యాపారవేత్త. రీవాగా సుపరిచితురాలు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది. జొహాన్నెస్‌బర్గ్ స్కూల్‌లో గురువారం మహిళా సాధికారతపై ఆమె ప్రసంగించాల్సి ఉంది. 'ఫర్ హిమ్ మేగజైన్' వెల్లడించిన టాప్ 100 సెక్సీయెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ జాబితాలో రీవాకు రెండుసార్లు చోటు దక్కింది. కాగా, చనిపోయే కొద్దిసేపు ముందు ఆమె వాలైంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేసింది. 'ప్రతి ఒక్కరి ప్రేమకూ ఇదో రోజు' అంటూ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications