దాసరి నోట తెలంగాణ మాట: హీరోలు రావాలని వ్యాఖ్య

నాగేశ్వర రావు, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు వంటి ఆణిముత్యాలు తెలంగాణ నుండి వచ్చారన్నారు. హీరో శ్రీహరి కూడా ఇక్కడి నుండే వచ్చాడన్నారు. తెలంగాణ జిల్లాల నుండి హీరోలు రావాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్, మెదక్, వరంగల్.. ఇలా అన్ని తెలంగాణ జిల్లాల నుండి కథానాయకులు వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సినీ కుటుంబాల నుంచే హీరోలు వస్తున్నారన్నారు. అలా రావడం తప్పని తాను భావించడం లేదన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ పరిశ్రలోకి వచ్చి ఉంటే జీవితంలో డైరెక్టర్‌ని అయ్యే వాడిని కాదన్నారు. సినిమాకి రూ.50-60 కోట్లుపెడుతున్నారని, పెద్ద సినిమా తప్ప వేరేది విడుదలయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవన్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తే కొత్త హీరోలు, ఆర్టిస్టులు రాగలరా? అనిపిస్తోందని, కుటుంబాల నుండి హీరోలు వస్తున్నారని, కొత్త వాళ్లకి ఎక్కడ ఛాన్స్ ఉండట్లేదని అభిప్రాయపడ్డారు.
అవకాశాలన్నీ ఆ కుటుంబాలకే వెళ్లిపోతున్నాయని, అది తాను తప్పనడం లేదని, వారూ కష్టపడుతున్నారని, పేరు బలం ఓ సినిమాకి మాత్రమే పనికొస్తుందన్నారు. ఆ తర్వాత వారి టాలెంట్ మీదే పైకి వస్తారని చెప్పారు. తెలంగాణ నుండి నితిన్ హీరోగా ఉన్నాడని చెప్పారు.
-
ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదు! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
పెళ్లయ్యాక తొలి బర్త్డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్












Click it and Unblock the Notifications