ప్రియురాలి హత్య: ఏడ్చిన ఆస్కార్, అమ్మాయిల పిచ్చి

Weeping Pistorius faces premeditated murder charge
జోహన్నస్‌‍బర్గ్: ప్రియురాలిని దొంగగా భావించి తుపాకితో కాల్చి చంపిన దక్షిణాఫ్రికాకు చెందిన ఒలింపిక్ అండ్ పారాలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ కోర్టులో ఏడ్చాడు. బ్లేడ్ రన్నర్ అస్కార్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ సమయంలో పిస్టోరియస్ ముఖానికి చేతులు పెట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. దంతో జడ్జి అతనిని ఊరడించి విచారణ ప్రారంభించాడు. రీవాను తాను హత్య చేయలేదని, పొరపాటున జరిగిందని చెప్పాడు.

అమ్మాయిల పిచ్చి

అందరూ అనుకుంటున్నట్టు పిస్టోరియలస్ అంత ఉత్తముడేమీ కాదని ఆయన మాజీ ప్రియురాలు సమంత టేలర్ గత ఏడాది ఓ సందర్భంలో చెప్పింది. పిస్టోరియస్‌తో సమంత ప్రేమాయణం కొద్దిరోజులు కొనసాగింది. ఆ తర్వాత బెడిసికొట్టింది. ఆ తర్వాత పిస్టోరియస్ రీవాతో ప్రేమలో పడ్డాడు.

రీవా మృతి అనంతరం సమంత స్పందిస్తూ... అస్కార్ అమ్మాయిలకు దూరంగా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంటుందని, ఆ సమయంలో అతనితో ఆమె కాకుండా మరెవరో ఉండి ఉండవచ్చునని సందేహం వ్యక్తం చేసింది. అస్కార్‌కు అమ్మాయిల పిచ్చి అని సమంత చెప్పకనే చెప్పింది.

అస్కార్ గర్ళ్ ఫ్రెండ్స్ లిస్టులో రీవా, సమంతలతో పాటు జెన్నా ఎడ్కిన్స్, అనస్తాసియా కోజిసోవా, మెలిస్సా రోమ్, చానెల్లీ డుప్లెసిస్.. ఇలా పెద్ద జాబితానే ఉందట. అతనికి అమ్మాయిలతో పాటు బైక్, రేసు కార్ల పిచ్చి కూడా ఉందట. అతనికి ఫాస్ట్ కార్లంటేనే ఇష్టం. అస్కార్‌కు వేగంగా దూసుకెళ్లే కార్లంటే ఇష్టమని ట్రయినర్ జానీ బ్రూక్స్ తెలిపారు.

కాగా ఫిబ్రవరి 14న ప్రియుడి చేతిలో మృతి చెందిన రీవా ప్రేమికుల దినోత్సవం రోజు ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ప్రేమ కోసం ఈ రోజు మీరెలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారని ట్వీట్ చేసింది. అదే రోజు పిస్టోరియస్‌ను ఆటపట్టించబోయి హత్య గావించబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+