వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్ షోనా? అందుకే వైయస్, షర్మిల యాత్ర: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పైన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనురాధ శనివారం నిప్పులు చెరిగారు. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కాకుండా ర్యాంపుపై ఓ మోడల్ షోలా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపదను దోచుకున్న గజదొంగ అయిన సోదరుడిని రక్షించుకునేందుకే ఆమె పాదయాత్ర చేస్తున్నారన్నారు.

ఈ విషయం ప్రజలకు తెలుసునన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అవినీతిపరులైన వారినే తాము గౌరవంగా సంభోదిస్తుంటే.. షర్మిల మాత్రం తన పాదయాత్రలో బాబును ఏకవచనంతో సంభోదిస్తున్నారని విమర్శించారు. తమపై వచ్చిన అవినీతి మరకలు తుడిచి వేయించుకునే ఉద్దేశ్యంలో భాగంగానే ఆమె యాత్ర సాగుతోందన్నారు.

షర్మిల పాదయాత్ర ఎందుకో ప్రజలకు తెలుసునన్నారు. ఆమె తీరును గమనిస్తున్నారన్నారు. ఖబర్దార్ షర్మిల అంటూ హెచ్చరించారు. షర్మిల మేనమామ ఓ 420 అని, అన్న జగన్ ఓ గజదొంగ అని దుయ్యబట్టారు. తమ పార్టీ గురించి, తమ పార్టీ అధినేత గురించి అవాకులు, చవాకులు పేలితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. తనపై ఉన్న రక్తపు మరకలను కడిగేసుకోవాలన్న తాపత్రయంతో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారని ఆరోపించారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా, అవినీతి మరక తొలగించుకునేందుకు, అన్న కోరిక నెరవేర్చేందుకు షర్మిల పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. వైయస్ కుటుంబం చేసిన అవినీతికి వారంతా ప్రజల కాళ్లుపట్టుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్ ఇంట్లో 70 గదులు ఉంటే అది ఖచ్చితంగా జాతీయ విషయమే అన్నారు. దోచుకున్న సొమ్ముతో కట్టుకున్నారన్నారు. ముదిగొండలో ఏడుగురిని పొట్టనపెట్టకోవటానికి నలబై గజాల స్థలం కారణమైన నేపథ్యంలో ఇది జాతి విషయమేనని స్పష్టం చేశారు. రైతుల గురించి మాట్లాడుతున్న షర్మిల తన తండ్రి హయాంలో జరిగిన 5 వేల మంది రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు.

English summary
Sharmila yatra seems like Model Show: TDP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X