కారులో యువతిపై లైంగికదాడి, మహిళ హత్య

పోలీసులు అందించిన వివరాల ప్రకారం - టోలీచౌక్‌లోని నిజాంకాలనీకి చెందిన ఓ నిర్మాణ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సొహైల్ షమ్మీ జబిరి, అతని స్నేహితులు ట్రావెల్స్ వ్యాపారి గౌస్‌ఖాన్, షాబుద్దీన్‌లతో కలిసి ఆ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత లాన్సర్ కారులో వెళ్తుండగా రేతిబౌలి ఈ సేవా కేంద్రం వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కూర్చున్న యువతిని గమనించారు. ఆమెను కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు.
రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు అది చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పంజగుట్ట నుంచి అమీర్‌పేట వైపు వెళ్తున్న కారును పట్టుకున్నారు. ఈ సమయంలో ఒకతను కారు నడుపుతుండగా, మరో ఇద్దరు యువతిపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఇదిలా వుండగా, విశాఖపట్నం రెడ్డికంచరపాలెంలో ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చారు. ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మహిళ హత్య రెండు, మూడు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications