దుబాయ్ ఆస్పత్రిలో ఆమర్ సింగ్: ఆరోగ్యం విషమం

ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయితే నిలకడగా ఉందని తెలిపారు. అమర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యలకు చికిత్స పొందారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
అమర్ సింగ్‌ను దుబాయ్‌లోని వెల్‌కేర్ ఆస్పత్రిలో చేర్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణపై సమాజ్‌వాదీ పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో చురుగ్గా వ్యవహరించారు.
చాలా కాలంగా అమర్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.












Click it and Unblock the Notifications