• search

బాబుకు చేయి: జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే సాయిరాజ్

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    YSR Congress
    హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు శిరియా సాయిరాజ్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు. ఆయన బుధవారం ఉదయం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో సాయిరాజ్ జగన్ పార్టీ జెండా కప్పుకున్నారు.

    కాగా, తెలుగుదేశం పార్టీలోని రాజకీయాలతో తాను విసిగిపోయి బయటకు వస్తున్నానని శిరియ సాయిరాజ్ నాలుగు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ములాకత్ సమయంలో ఆ రోజు ఉదయం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    తాను త్వరలో జగన్ పార్టీలో చేరుతానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ పార్టీ నేత ఎర్రన్నాయుడు మృతి తర్వాత తాను పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయాలతో విసిగిపోయానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, వాటిని చూసి తాను జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.

    తన రాజకీయ గురువు ఎర్రన్నాయుడు అకాల మృతితో తర్వాత తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆయన తర్వాత జిల్లాలో సమస్యలు పరిష్కరించే వారు కరువయ్యారన్నారు. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినా లాభం లేకపోయిందన్నారు. మొదట తాను రాజకీయాల నుండి తప్పుకుందామని భావించానని కానీ, వైయస్ పాలన చూసి జగన్ వద్దకు చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

    వచ్చే ఎన్నికల్లో తనకు జగన్ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వెంట నడుస్తానని చెప్పారు. తన జిల్లా సమస్యలను జగన్‌కు వివరించాలని, ఏవిధంగా పరిష్కరిస్తారో చర్చించానన్నారు. ప్యాకేజీకి అమ్ముడుపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాయిరాజ్ సస్పెన్షన్ జగన్‌తో భేటీ అయిన విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఎమ్మెల్యే శిరియ సాయిరాజ్ పైన బహిష్కరణ వేటు వేసింది. సాయిరాజ్‌తో పాటు ఆయనను కల్సిన ఇచ్ఛాపురం ఇంఛార్జ్ వెంకటరణలపై కూడా వేటు వేసింది.

    English summary
    Srikakulam district Telugudesam Party MLA Sairaj was joined in YSR Congress on Wednesday.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more