ఆరోగ్యం జాగ్రత్త!: ఎట్టకేలకు బాబును కలిసిన బాలయ్య

Chandrababu Naidu - Balakrishna
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ బుధవారం ఉదయం కలిశారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బాబు యాత్రకు విశ్రాంతి వచ్చింది. దీంతో బాలకృష్ణ ఈ రోజు ఉదయం జిల్లాలోని వేమూరులో బాబు బస చేసిన ప్రాంతానికి వచ్చి ఆయనను కలిశారు.

బాబు ఆరోగ్య పరిస్థితిపై బాలయ్య అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఐదు రోజుల క్రితం చంద్రబాబు మెట్లు కూలడంతో తూలిపడటం, అంగరక్షకులు అప్రమత్తమై రక్షించిన విషయం తెలిసిందే. దీనిపై బాలయ్య పార్టీ నేతలను, బాబును అడిగి తెలుసుకున్నారు. బాబుతో కాసేపు మాట్లాడిన బాలయ్య ఆయన ఆరోగ్య పరిస్థితి పైనే మాట్లాడారు. వారి మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని తెలుస్తోంది.

కాగా అంతుముందు రోజు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చిన హీరో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వేమూరు ప్రాంతంలోని బాబు బసకు చేరుకున్న బాలయ్యను చంద్రబాబును కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఉన్న బస్సులోకి వెళ్లకుండా ఆయనను పోలీసులు అనుమతించలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మరో 48 గంటల పాటు బాబును కలిసేందుకు అనుమతించబోమని చెప్పారు.

లేదంటే ఈ రెండు రోజులూ బాబుతోనే బస్సులో ఉండిపోవాల్సి వస్తుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు. కోడ్ పరిధిలోకి కుటుంబ సభ్యులు రారనే విషయాన్ని గుర్తు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

దీంతో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు అక్కడి నుంచే కలెక్టర్‌తో మాట్లాడారు. బాలకృష్ణ చంద్రబాబు కుటుంబ సభ్యుడనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో బుధవారం 8 గంటలకు బాబును కలిసేందుకు బాలయ్యకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కలెక్టర్ అనుమతితో బాలకృష్ణ ఈ రోజు ఉదయం బాబును కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+