అమెరికాలో భార్యాపిల్లలను హత్య చేసిన టెక్కీ అరెస్టు

 Detroit butcher wanted for murder of wife, children arrested in Hyderabad
హైదరాబాద్: చాలా కాలంగా వెతుకున్న టెక్కీ హైదరాబాద్ నేర పరిశోధక విభాగం అధికారులకు చిక్కాడు. అమెరికాలో 2008లో భార్యను, పిల్లలను హత్య చేసి పరారీలో ఉన్న నెరుసు లక్ష్మినారాయణ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నెరుసు లక్ష్మినారాయణ 2008 అక్టోబర్ 13వ తేదీన అమెరికాలోని మిచిగాన్‌లో తన భార్య ఎన్ జయలక్ష్మిని, కూతురు తేజస్వి (14)ని, కుమారుడు శివ (12)ను హత్య చేశాడు. ఉద్యోగం కోల్పోయిన నిస్పృహలో అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

భార్యాపిల్లలను హత్య చేసిన తర్వాత అతను ఇండియాకు పారిపోయి వచ్చాడు. సిఐడి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అతనిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ పెండింగులో ఉంది. ఎఫ్‌బిఐ కూడా అతని కోసం గాలిస్తోంది. అతను డెట్రాయిట్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా హైదరాబాదు పారిపోయి వచ్చినట్లు చెబుతున్నారు.

ఆ తర్వాత 2009 ఏప్రిల్‌లో అతను వుయ్యూరుకు వచ్చాడు. అతనిపై వుయ్యారులో కేసు నమోదైంది. జయలక్ష్మి సోదరి ఫిర్యాదు మేరకు అతనిపై వరకట్నం వేధింపుల కేసు కూడా నమోదై ఉంది. సిఐడి అదనపు డిజిగా కృష్ణప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టిన రావు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అతని సెల్‌ఫోన్ నెంబర్లను, బ్యాంక్ లావాదేవీలను, ఎటిఎం కార్డు వాడకాన్ని, ఇమెయిల్స్‌ను ట్రాక్ చేశారు.

లక్ష్మినారాయణ భార్య కృష్ణా జిల్లా వుయ్యూరులోని మేనత్త కూతురే. వుయ్యూరు అకునూరులో లక్ష్మినారాయణ తండ్రి కోటేశ్వర రావు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కామర్స్‌లో డిగ్రీ చేశాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాడు. భార్యాపిల్లలను అతను 2001లో అమెరికా తీసుకుని వెళ్లాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+