Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాంకేతిక లోపం: సముద్రం మధ్యలో నిలిచిన నౌక

Ship halted by engine fail
విశాఖపట్నం/హైదరాబాద్: విశాఖపట్నం నుండి అండమాన్ నికోబర్ దీవులకు వెళ్తున్న ఓ ప్రయాణీకుల నౌక సాంకేతిక లోపం కారణంగా సముద్రం మధ్యలో నిలిచిపోయింది. ఈ నెల 18వ తేదిన ఈ నౌక విశాఖ నుండి బయలుదేరింది. ఈ రోజు ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రం మధ్యలో నిలిచిపోయింది.

నౌకకు చెందిన రెండు ఇంజన్లు చెడిపోయాయి. ఈ నౌకలో 750 మందికి పైగా ప్రయాణాకులు ఉన్నారు. సాంకేతిక లోపం తలెత్తిందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నౌకను తిరిగి విశాఖ తీరానికి తీసుకు వస్తున్నారు. దానిని ప్రస్తుతం ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. చర్యలు చేపట్టామన్నారు.

చిన్నారి ఆచూకీ లభ్యం

రెండు రోజుల క్రితం ఉప్పల్‌లో కిడ్నాప్‌కు గురైన రెండేళ్ల చిన్నారి ఆచూకి లభ్యమైంది. చిన్నారిని గుర్తు తెలియని ఇద్దరు మహిళలు అపహరించారు. చిన్నారని అపహరిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం ఉదయం బీబీనగర్‌లో చిన్నారి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

కిడ్నాపర్లు చిన్నారితో పాటు బీబీనగర్‌లో ఉన్నారు. చిన్నారని కిడ్నాప్ చేశారనే విషయం తెలుసుకున్న స్థానికులు కిడ్నాపర్లను గ్రామపంచాయతీలో బందించారు. ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉప్పల్ పోలీసులు పట్టుకొని చిన్నారి తల్లిదండ్రులతో పాటు బీబీనగర్ చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+