ఒరిగిందేమీ లేదు: బడ్జెట్‌పై పెదవి విరిచిన బాబు

Chandrababu Naidu
విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో లఘు పరిశ్రమలకు ప్రోత్సాహం లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతుందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మోపిదేవిలో మీడియాతో మాట్లాడారు. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌పై ఆయన పెదవి విరిచారు.

యుపిఎ పాలనలో 1.50 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రణాళిక లేదని విమర్శించారు. అవినీతిని, నల్లధనాన్ని అదుపు చేసేందుకు విధానాలేవీ ప్రకటించలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన అన్నారు.

ఫ్లోరైడ్ నివారణ కోసం కేటాయించిన 1400 కోట్ల రూపాయలు ఒక్క జిల్లాకు కూడా సరిపోవని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన 300 కోట్ల రూపాయలు ఆహార భద్రతకు ఏ మాత్రం సరిపోవని చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని చంద్రబాబు విమర్శించారు. సంక్షేమ పథకాలకు కోత పెట్టారని, సబ్సిడీలు దారి మళ్లుతున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి సరైన కేటాయింపులు లేవని ఆయన అన్నారు.

బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని చంద్రబాబు విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చార్జీల పెంపు పేదవారికి పెనుభారంగా మారుతుందని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాడినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+