ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

Woman kills husband with help of lover
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ప్రకాశం జిల్లా పరుచూరు మండలం రాజుగారిపాలెంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

దీంతో మృతుని బంధువులు పోలీసులను ఆశ్రయించారు. భార్యే అతన్ని చంపి శవాన్నిఇంట్లో పూడ్చి పెట్టిందని వారు ఆరోపించారు. కోటేశ్వర రావు భార్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేపులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్త వేధింపులు భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో గురువారం ఉదయం ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

అదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో జర్నలిస్టు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికి ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+