వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాలు: జయప్రద, అగస్టాపై జెపిసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprada
న్యూఢిల్లీ: చాలామంది ప్రముఖులు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలతో ఇబ్బంది పడుతున్నారని ఉత్తప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద లోకసభలో అన్నారు. కొందరు ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి వాటిలో నగ్న చిత్రాలు పోస్ట్ చేస్తున్నారని ఆమె చెప్పారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు, వెంటనే తొలగించేందుకు వీలు ఉండటం లేదని ఆమె చెప్పారు. ఆమె వ్యాఖ్యలతో కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కూడా ఏకీభవించారు. ఇలాంటి వాటిని ఖండించాలని చెప్పారు.

బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి కపిల్ సిబాల్ దేశంలో అంతర్జాలం, ఎటిఎం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మోసాలు తగ్గాయని చెప్పారు. 2010లో నమోదన కేసులతో పోల్చితే ఇప్పుడు తగ్గిందన్నారు. నేరాల నియంత్రణకు వీలుగా సెర్ట్‌ను ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. అదే సమయంలో బిజెపి ఎంపి సంజయ్ జైశ్వాల్ జోక్యం చేసుకొని తన మొబైల్‌కి, అధికారిక వెబ్ సైట్‌కి పలు నకిలీ సందేశాలు వస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో జయప్రద ప్రముఖులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

కాగా, హెలిస్కాంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్కాం మూలాలు ఏంటో తేల్చడానికి, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పార్లమెంటుకు తెలిపింది. 30 మంది సభ్యులున్న ఈ జెపిసిలో ఎక్కువగా బిజెపి, జెడి(యూ), తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఎజిపి లాంటి విపక్షాల సభ్యులే ఉన్నారు.

మొదటగా జెపిసి సమావేశం జరిగినప్పటి నుంచి మూడు నెలల్లోగా నివేదిక సమర్పిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. విపక్ష సభ్యులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. సంవత్సరంతో లోక్‌సభ పదవీకాలం ముగుస్తుంది కాబట్టి విచారణను కాలదోషం పట్టించడానికే సర్కారు ఈ జెపిసి ఎత్తుగడ వేసిందని బిజెపి విమర్శించింది. రూ.3,600 కోట్ల ఒప్పందంలో స్కాం జరిగినా, ఏడాది నుంచి ప్రభుత్వం నిష్క్రియాపరత్వంతోనే ఉందని అంతకుముందు సభలో జరిగిన చర్చలో విపక్షాలు ఆరోపించాయి.

English summary
Brushing off protests from the BJP and other parties, the government on Wednesday set up a joint parliamentary committee (JPC) to probe the AgustaWestland chopper scam after it secured the support of the SP, the BSP and the CPM for the move designed to contain the political fallout from the bribery scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X