ఊహించని విధంగా నిరాశ: బడ్జెట్‌పై సుష్మా స్వరాజ్

చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనకారిగా ఉందని, సామాన్యులను, ఎస్సీఎస్టీలను విస్మరించిందని బిఎస్పీ నేత మాయావతి అన్నారు. బడ్జెట్ బీహార్ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యంగ్యంగా అన్నారు.
చిదంబరం అతి సాధారణమైన బడ్జెట్‌ను ప్రతిపాదించారని, బడ్జెట్ లక్ష్యరహితంగా ఉందని, నిరాశాజనకంగా ఉందని లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌లో కొత్త దనం ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న 80 శాతం మంది ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ అంకెల గారడీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. యుపిఎ వైఫల్యం వల్లనే దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణ, చేతి వృత్తులవారికి అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఏ విధమైన ప్రయోజనం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications