బెంగాల్లో రెండు కాంగ్రెస్, ఒకటి టిఎంసి: త్రిపురలో లెఫ్ట్!

త్రిపురలో వామపక్ష కూటమి అధికారం దిశగా కొనసాగుతోంది. ఇప్పటికి ఆరుసార్లు వామపక్షాలు త్రిపురలో జయకేతనం ఎగురవేశాయి. ఇప్పుడు ఏడోసారి విజయం దిశగా ఆ కూటమి దూసుకుపోతోంది. 60 శాసనసభ స్థానాలకు గాను 44 వామపక్ష కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఐదు వారి ఖాతాలో పడ్డాయి. ఒక స్థానంలో కాంగ్రెసు విజయం సాధించింది.
మేఘాలయలో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 24 స్థానాల్లో కాంగ్రెసు, ఒక స్థానంలో ఎన్సీపి, యుడిపి ఐదు స్థానాల్లో, బిజెపి 13 స్థానాల్లో, ఎన్‌పిపి రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెసుకు గతంలో వచ్చిన సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాగాలాండులో అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్‌పిఎఫ్ 20 స్థానాల్లో, కాంగ్రెసు 5 స్థానాల్లో, ఎన్సీపి 5 స్థఆనాల్లో బిజెపి 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్‌పిఎఫ్ ఏడు, కాంగ్రెసు ఒక స్థానంలో విజయం సాధించాయి.












Click it and Unblock the Notifications